Tirumala Laddu Row: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు నిలిపివేత

SIT probe on Tirumala Laddu adulteration has stopped

  • శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు
  • గత మూడ్రోజులుగా సిట్ విచారణ
  • నిన్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  • తదుపరి విచారణ అనంతరం సిట్ దర్యాప్తు కొనసాగుతుందన్న డీజీపీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత మూడ్రోజులుగా సిట్ సభ్యులు తిరుపతిలో మకాం వేసి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించారు. 

అయితే నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

సుప్రీంకోర్టులో తదుపరి విచారణ (అక్టోబరు 3) అనంతరం, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా సిట్ విచారణ మళ్లీ కొనసాగుతుందని డీజీపీ వివరించారు.

  • Loading...

More Telugu News