Goat: ఓటీటీలోకి 'గోట్' మూవీ.. ఎప్పుడు, ఎక్క‌డ స్ట్రీమింగంటే..!

Goat Ott Release When And Where To Watch

  • ఈ నెల 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'గోట్‌' ప్రసారం
  • 'ఎక్స్' వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌
  • ఒకేసారి తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల‌

దళపతి విజయ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెంకట్‌ప్రభు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ తాజా చిత్రం ‘గోట్‌' (గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌). సెప్టెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ సినిమా ప్రేక్ష‌క‌లను బాగానే అల‌రించింది. అయితే, తెలుగులో మాత్రం గోట్‌కు అంత‌గా ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఈ మూవీ ఆక‌ట్టుకోలేక‌పోయింది.  

తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేందుకు రెడీ అయింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో 'గోట్‌' ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించింది. తమిళంతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది.

ఇక ఈ సినిమాలో విజ‌య్‌తో పాటు ప్రశాంత్‌, వైభ‌వ్‌, ప్రభుదేవా, లైలా, జయరాం, యోగిబాబు, కిచ్చా సుదీప్ ఇత‌ర కీలక పాత్రల్లో క‌నిపించారు. విజయ్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీలో ఆయ‌న‌కు జోడిగా మీనాక్షి చౌదరి, స్నేహ న‌టించారు. యువ‌న్ శంక‌ర్ రాజా బాణీలు అందించారు.

  • Loading...

More Telugu News