Vaibhav Suryavanshi: ఆస్ట్రేలియా అండర్-19పై అత్యంత వేగంగా సెంచరీ.. 13 ఏళ్ల భారత ఆటగాడు వైభవ్ సంచలన రికార్డ్

13 year old Vaibhav Suryavanshi smashes fastest hundred for India U19 in Youth Test vs Australia

  • ఆస్ట్రేలియా అండర్-19తో చెన్నైలో అనధికారిక టెస్ట్ 
  • 58 బంతుల్లో సెంచరీ నమోదు
  • రెండు బంతుల తేడాతో మెయిన్ అలీ ఆల్‌టైం రికార్డు మిస్

భారత అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. చెన్నైలో నిన్న ఆస్ట్రేలియాపై జరిగిన అనధికార టెస్టు మ్యాచ్‌లో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసి రికార్డు పుస్తకాల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 58 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు.
13 ఏళ్ల వైభవ్ తొలి రోజు సోమవారం మెరుపు వేగంతో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

నిన్న రెండో రోజు 81 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన వైభవ్ మొత్తంగా 58 బంతుల్లో తొలి సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. రెండు బంతుల తేడాతో మొయిన్ అలీ ఆల్‌టైం రికార్డును చేజార్చుకున్నాడు. అండర్-19 టెస్టుల్లో  శ్రీలంకపై 2005లో మొయిన్ అలీ 56 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

  • Loading...

More Telugu News