AP Govt: మ‌రో ప‌థ‌కం పేరు మార్చిన ఏపీ స‌ర్కార్‌

AP Government Changed Jagananna Thodu Scheme Name

  • 'జ‌గ‌న‌న్న తోడు' ప‌థ‌కం పేరు మారుస్తూ ఉత్తర్వులు 
  • 'చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు'గా మార్చిన ప్ర‌భుత్వం
  • ఈ స్కీమ్ ద్వారా చిరు వ్యాపారుల‌కు రూ.10వేల రుణ సాయం

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా మ‌రో ప‌థ‌కం పేరు మార్చింది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో అమ‌లు చేసిన‌ పలు పథకాల పేర్లను మార్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు గత ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన‌ 'జగనన్న తోడు' స్కీమ్‌ పేరును మార్చింది. 

ఈ పథకానికి 'చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు'గా పేరు మారుస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ స్కీమ్‌ పేరు మార్పు కోసం గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది.

కాగా, గత వైఎస్‌ జ‌గ‌న్‌ ప్రభుత్వం చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, హస్త కళాకారుల కోసం 'జగనన్న తోడు' పథకం కింద రూ. 10వేల ఆర్థిక సాయం అందించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఏటా వడ్డీలేని రూ.10 వేల రుణం అందించారు.

More Telugu News