Hyderabad: ఆ రెండు మెట్రో స్టేషన్‌లలో పార్కింగ్ ఫీజు వసూలు: హైదరాబాద్ మెట్రో
- నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్‌లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయం
- నామమాత్రపు ఫీజు వసూలు చేస్తామని ప్రకటించిన హైదరాబాద్ మెట్రో
- మెట్రో ప్రయాణికులకు ఆఫర్లను వచ్చే మార్చి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడి
హైదరాబాద్ మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్‌లలో వాహనాల పార్కింగ్ కోసం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఇక్కడ వాహనాలకు ఎలాంటి ఫీజును వసూలు చేయడం లేదు. అయితే అక్టోబర్ 6వ తేదీ నుంచి ఈ రెండు మెట్రో స్టేషన్‌లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయనున్నట్టు హైదరాబాద్ మెట్రో తెలిపింది. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత కోసమే నామమాత్రపు ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లు మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు.
ప్రయాణికులకు మెట్రో రైలు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. ప్రయాణికులకు ఇస్తున్న ఆఫర్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లు 2025 మార్చి 31 వరకు ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగించింది.