Raa Macha Macha: మెగా ఫ్యాన్స్ ఊగిపోయేలా... గేమ్ చేంజర్ నుంచి 'రా మచ్చా మచ్చా' సాంగ్ విడుదల

Second single from Ram Charan Game Changer out now

  • రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ చేంజర్
  • తాజాగా రెండో సింగిల్ ను తీసుకువచ్చిన చిత్రబృందం
  • తమన్ బాణీలకు అనంతశ్రీరామ్ సాహిత్యం
  • ఆలపించిన నకాష్ అజీజ్

మెగా ఫ్యాన్స్ ను అలరించేందుకు రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' చిత్రం నుంచి రెండో పాట విడుదలైంది. ఇప్పటికే 'జరగండి' పాటతో ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ పెంచేసిన గేమ్ చేంజర్ చిత్రబృందం... నేడు 'రా మచ్చా మచ్చా' పూర్తి పాటను రిలీజ్ చేసింది. తమన్ బాణీలకు అనంతశ్రీరామ్ సాహిత్యం అందించారు. గాయకుడు నకాష్ అజీజ్ ఆలపించారు. 

'గేమ్ చేంజర్' చిత్రంలో ఈ పాట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ కావడంతో దర్శకుడు శంకర్ ఎంతో శ్రద్ధతో ఈ పాటను చిత్రీకరించినట్టు విజువల్స్ చెబుతున్నాయి. 1000 మంది కళాకారులతో రామ్ చరణ్ స్టెప్పులు ఈ పాటలో హైలైట్. 

దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో క్రిస్మస్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా... అంజలి, సముద్రఖని, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Raa Macha Macha
Second Single
Ram Charan
Shankar
Thaman
Nakash Aziz
Anantha Sriram

More Telugu News