Nara Bhuvaneswari: రాజమండ్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari inaugurates Blood Bank in Rajahmundry
  • ఎన్టీఆర్ ట్రస్టు కార్యకలాపాల విస్తరణ
  • ఇప్పటిదాకా హైదరాబాద్, విశాఖ, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు
  • నాలుగో బ్లడ్ బ్యాంకును రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్టు
ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు రాజమండ్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంకు నెలకొల్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యకలాపాలను మరింత విస్తరిస్తుండడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. 

ఇప్పటిదాకా మూడు బ్లడ్ బ్యాంకులు స్థాపించామని, ఇవాళ రాజమండ్రిలో ప్రారంభించినది నాలుగో బ్లడ్ బ్యాంకు అని తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు ఇప్పటికే నడుస్తున్నాయని నారా భువనేశ్వరి వివరించారు. 

ఎన్టీఆర్ ట్రస్ట్ సారథ్యంలోని బ్లడ్ బ్యాంకుల ద్వారా 8.1 లక్షల మంది నిరుపేదలకు, థలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా రక్తం అందించామని వెల్లడించారు. రక్తదానం చేసిన దాతలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు.
Nara Bhuvaneswari
Blood Bank
Rajahmundry
NTR Trust

More Telugu News