Team India: ఇంగ్లండ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా

Team India breaks England record

  • కాన్పూర్ లో టీమిండియా × బంగ్లాదేశ్ రెండో టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 233 పరుగులకు ఆలౌట్ అయిన బంగ్లాదేశ్
  • అనంతరం దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్
  • 18 బంతుల్లోనే తొలి 50 పరుగులు చేసిన వైనం
  • గతంలో ఇంగ్లండ్ పేరిట 26 బంతుల్లో 50 పరుగుల రికార్డు

కాన్పూర్ టెస్టులో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ రికార్డును బద్దలు కొట్టింది. ఇవాళ ఆటకు నాలుగో రోజు కాగా, తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 233 పరుగులకు ఆలౌట్ అయింది. 

అనంతరం, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా అతి తక్కువ బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ చెలరేగడంతో టీమిండియాకు 18 బంతుల్లోనే 50 పరుగులు వచ్చాయి. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. ఇంగ్లండ్ 26 బంతుల్లో తొలి 50 పరుగులు చేసింది. ఇప్పుడా రికార్డును భారత జట్టు తిరగరాసింది. 

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ జోడీ తొలి వికెట్ కు 55 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 11 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 23 పరుగులు చేసి మిరాజ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 

ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 99 పరుగులు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 63, శుభ్ మాన్ గిల్ 11 పరుగులతో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News