Venumadhav: ఆయన వస్తారనే అనిపిస్తూ ఉంటుంది: వేణుమాధవ్ భార్య శ్రీవాణి

Sri Vani Venu Madhav Interview

  • పెళ్లి తరువాతే వేణుమాధవ్ బిజీ అయ్యారన్న శ్రీవాణి
  • ఆయన ఉన్నారనే ఆలోచనతో బ్రతుకుతున్నామని వెల్లడి 
  • ఆర్ధికంగా ఇబ్బందులు లేవని వివరణ 
  • పిల్లలతో చాలా ప్రేమగా ఉండేవారన్న శ్రీవాణి  


తెలుగు తెరపై నవ్వుల సందడి చేసిన స్టార్ కమెడియన్ వేణు మాధవ్. ఆయన డైలాగ్ డెలివరీనీ .. బాడీ లాంగ్వేజ్ ను ఎంతోమంది ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వేణుమాధవ్ ఆ మధ్య అనారోగ్యంతో చనిపోయారు. ఆయన భార్య శ్రీవాణి .. పెద్దబ్బాయి ప్రభాకర్ .. చిన్నబ్బాయి సావికర్ తాజాగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

శ్రీవాణి మాట్లాడుతూ .. "మా పెళ్లి తరువాతనే వేణుమాధవ్ బిజీ అయ్యారు. అవుట్ డోర్ షూటింగు ఉన్నప్పుడు రెండు మూడు వారాల తరువాత రావడం ఆయనకి అలవాటే. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడో షూటింగులో ఉన్నారు, రేపో మాపో వచ్చేస్తారు అనే నాకు అనిపిస్తూ ఉంటుంది. షూటింగుకి బయటికి వెళ్లినప్పుడు, ఏ మాత్రం సమయం దొరికినా తనే కాల్ చేస్తూ ఉండేవారు. పిల్లలను ఆయన ఎంతో బాగా చూసుకునేవారు" అని అన్నారు. 

"వేణుమాధవ్ గారికి డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అయితే హాస్పిటల్ కి రమ్మంటే ఆయన రాలేదు. తీరా తీసుకుని వెళ్లే సరికి పరిస్థితి చేయిదాటిపోయింది. ఆర్ధికంగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆయన తీసుకున్న ముందస్తు జాగ్రత్తనే అందుకు కారణం. అప్పట్లో ఆయనతో సన్నిహితంగా ఉన్న బ్రహ్మానందం .. తనికెళ్ల భరణి వంటివారు, ఇప్పటికీ మా క్షేమ సమాచారాలు అడుగుతూనే ఉంటారు" అని  చెప్పారు. 

Venumadhav
Srivani
Prabhakar
Saavikar
  • Loading...

More Telugu News