Harry Brook: కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన హ్యారీ బ్రూక్
- ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో ఆసీస్‌పై అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్
- ఇంతకుముందు 310 పరుగులతో కోహ్లీ పేరిట ఈ రికార్డు
- తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 312 రన్స్ చేసిన ఇంగ్లండ్ సారథి బ్రూక్
- తద్వారా రెండు రన్స్ తేడాతో విరాట్ రికార్డు బ్రేక్
ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డును ఇంగ్లండ్ సారథి హ్యారీ బ్రూక్ బద్దలు కొట్టాడు. ఆదివారం బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన ఐదో వన్డేలో 25 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ ఈ ఘనత సాధించాడు.
2019లో ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న విరాట్ అద్భుతంగా రాణించాడు. ఐదు మ్యాచుల్లో 62 సగటుతో 310 పరుగులు చేశాడు.
తాజాగా బ్రూక్ ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఏకంగా 78 సగటు, 127.86 స్ట్రైక్‌రేటుతో 312 పరుగులు చేశాడు. తద్వారా కేవలం రెండు పరుగుల తేడాతో కోహ్లీ రికార్డును బ్రూక్ బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాత ఎంఎస్ ధోనీ 285 పరుగులతో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా ఇయాన్ మోర్గాన్ (278), బాబర్ ఆజం (276), ఏబీ డివిలియర్స్ (271), ఆండ్రూ స్ట్రాస్ (267) ఉన్నారు.
ఇక ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో అద్భుతమై ఆటను ప్రదర్శించిన ఇంగ్లండ్ యువ సారథి హ్యారీ బ్రూక్ వరుసగా 39, 04, 110, 87, 72 పరుగులు చేశాడు. ఇలా ఐదు వన్డేల్లో కలిపి మొత్తం 312 రన్స్ బాదాడు.