Devara: ఎన్టీఆర్ 'దేవర' రెండ్రోజుల కలెక్షన్స్ ఎంతంటే...!

Devara collections for two days

  • ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దేవర
  • కొరటాల శివ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం
  • సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేవర. ఈ హైఓల్టేజ్ యాక్షన్ మూవీ సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రివ్యూల పరంగా ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. 

తొలి రోజు రూ.172 కోట్ల గ్రాస్ వసూలు చేసిన దేవర... రెండో రోజు రూ.71 కోట్లు రాబట్టింది. రెండ్రోజుల్లో రూ.243 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 

కాగా, ఈ చిత్రానికి విడుదలకు ముందే బిజినెస్ బాగా జరిగింది. మరో వారం రోజుల్లో దేవర బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News