Hyderabad Metro: రూ.32,237 కోట్లతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ

Hyderabad Metro Rail phase 2 works starts soon

  • హైదరాబాదులో కొత్తగా ఏర్పాటయ్యే ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు
  • 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు
  • ఒకటిన్నర కిలోమీటరు దూరం భూగర్భంలో ప్రయాణించనున్న మెట్రో 

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులను రూ.32,237 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. రెండో దశలో... కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు పరుగులు తీయనుంది. మొదటి దశలో మూడు కారిడార్లలో మెట్రో రైలు 69 కిలోమీటర్ల మేర పరుగులు తీస్తోంది. రెండో దశలో మరో 6 కారిడార్లలో 116.2 కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలు విస్తరిస్తారు. రెండో దశ పూర్తయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైలు పరుగులు తీయనుంది. 

రెండో దశలో ఎయిర్ పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆరాంఘర్-బెంగళూరు రహదారిపై కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేయనున్నారు. 

కారిడార్-4లో నాగోల్ నుంచి శంషాబాద్ వరకు 36.6 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గానికి ప్రభుత్వ ఆమోదం లభించింది. ఎయిర్ పోర్టు కారిడార్ లో సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరం భూగర్భంలో మెట్రో రైలు ప్రయాణించనుంది. 

ఫోర్త్ సిటీకి రూ.8 వేల కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలును తీసుకురానున్నారు. మెట్రో రెండో దశ డీపీఆర్ లను త్వరలోనే కేంద్రం అనుమతి కోసం పంపనున్నారు.

  • Loading...

More Telugu News