Manchu Vishnu: ఈ విషయం పబ్లిక్ లో మాట్లాడితే ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయేమో!: మంచు విష్ణు

Manchu Vishnu comments on laddu row

  • ఇటీవల చర్చనీయాంశంగా తిరుపతి లడ్డూ
  • ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు
  • తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు
  • నచ్చని వాళ్లు తమను సులభంగా టార్గెట్ చేస్తారని వెల్లడి

గత కొన్ని రోజులుగా తిరుపతి లడ్డూ వివాదం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా ఉంది. ఈ వ్యవహారంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయడం, ప్రకాశ్ రాజ్ ట్వీట్ కు మంచు విష్ణు కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. 

తాజాగా, మంచు విష్ణును మీడియా పలకరించగా, ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వ్యవహారంపై పబ్లిక్ లో మాట్లాడితే ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయేమోనని భయంగా ఉందని అన్నారు. 

తాము సినీ నటులం అని, అద్దాల్లో మేడల్లో ఉంటామని... తాము ఏదైనా మాట్లాడితే కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు అని పేర్కొన్నారు. నచ్చనివాళ్లు తమను సులభంగా టార్గెట్ చేస్తారని మంచు విష్ణు వివరించారు. 

ఇక, ప్రకాశ్ రాజ్ ఇటీవల చేసిన ట్వీట్ ఆయన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. అలాగే నా అభిప్రాయం నేను తెలియజేశాను... ఇందులో ఎలాంటి వివాదం లేదు అని స్పష్టం చేశారు.

Manchu Vishnu
Tirupati Laddu
Prakash Raj
Social Media
  • Loading...

More Telugu News