Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కాస్త జాగ్రత్తపడాలి..!

Janhvi Kapoor should be careful

  • దేవర చిత్రంలో తంగం పాత్రలో కనిపించిన జాన్వీ 
  • అందాల ప్రదర్శనకే ఆ పాత్ర పరిమితం 
  • నిరాశలో జాన్వీ అభిమానులు

ఎన్టీఆర్‌-కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం 'దేవర'. జనతా గ్యారేజ్‌ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి బజ్‌ ఏర్పడింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్‌ను సాధించింది. ఉభయ తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా విదేశాల్లో కూడా రికార్డుల కలెక్షన్లను సాధిస్తోంది. మొదటి రోజు వసూళ్లతో పాటు రెండో రోజు కలెక్షన్లు కూడా నిలకడగానే వున్నాయని తెలిపారు మేకర్స్‌. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా నటించారు ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌. ఇది తెలుగులో ఆమెకు తొలిచిత్రం. 

గతంలో జాన్వీని తెలుగులో నటింపజేయాలని పలువురు దర్శక, నిర్మాతలు ప్రయత్నించినా కుదరలేదు. ఎట్టకేలకు దేవరతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ అందాలభామ. ఈ చిత్రంలో తంగం పాత్రలో గ్లామర్‌గా కనిపించారు జాన్వీ. అయితే ఈ చిత్రంలో జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదని, ఆ క్యారెక్టరైజేషన్‌ కూడా సరిగ్గా లేదని విమర్శలు వస్తున్నాయి.  కేవలం పాటలో జాన్వీ అందాల ప్రదర్శనకే పరిమితమైందని అంటున్నారు. తొలిసినిమాలో కచ్చితంగా ఆమె తన నటనతో ఆకట్టుకుంటుదని, కెరీర్‌లో తొలి చిత్రం ప్రత్యేకంగా వుంటుందని ఆశించిన ఆమె అభిమానులను దేవర డిజప్పాయింట్‌ చేసిందని అంటున్నాయి సినీ వర్గాలు. 

ఇకనైనా అంగీకరించబోయే సినిమాల్లో జాన్వీ తన పాత్రల విషయంలో కేర్‌ తీసుకోవాలసిన అవసరం వుందని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు. ఇక త్వరలోనే జాన్వీకపూర్‌,  రామ్‌చరణ్‌-బుచ్చిబాబు కలయికలో రూపొందనున్న చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ కాబోతుంది.

Janhvi Kapoor
Devara
Tangam
Devara songs
Ntr
Jr NTR
  • Loading...

More Telugu News