minister Satya Kumar: మంత్రి సత్యకుమార్‌‌కు షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు

TDP protest infront of the minister Satya Kumar office

  • గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్టు మల్లికార్జునపై ఆరోపణలు
  • బదిలీపై మళ్లీ ఆయన ధర్మవరం రావడంపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
  • మంత్రి సత్యకుమార్ కార్యాలయం వద్ద టీడీపీ నేతల ధర్నా
  • జిల్లా బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు  

ఓ అధికారి బదిలీ కూటమి నేతల మధ్య చిచ్చు రాజేసింది. పురపాలక కమిషనర్ బదిలీ అంశంపై సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీ నేత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పురపాలకశాఖ కమిషనర్ మల్లికార్జున వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా పనిచేశారని, అలాంటి వ్యక్తిని మళ్లీ ధర్మవరానికి ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. 

ధర్మవరంలోని మంత్రి కార్యాలయంలో నిర్వహిస్తున్న పురపాలక అధికారుల సమీక్ష సమావేశానికి కమిషనర్ హజరుకాగా, విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. కమిషనర్ ను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. వందలాది మంది ఆందోళనకు దిగడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో పోలీసు వాహనంలో కమిషనర్ మల్లికార్జునను తరలించారు. 

అనంతరం మంత్రి సత్యకుమార్ బయటకు రావడంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు ఆయనను చుట్టుముట్టాయి. బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు టీడీపీ కార్యకర్తలను పక్కకు పంపడంతో మంత్రి అక్కడి నుండి వెళ్లిపోయారు.

minister Satya Kumar
BJP
tdp
Satyasai dist
Darmavaram
  • Loading...

More Telugu News