Dasara Holidays: ఏపీలో అక్టోబరు 3 నుంచే దసరా సెలవులు

AP govt announces Dasara holidays

  • తొలుత అక్టోబరు 4 నుంచి సెలవులు ఇవ్వాలని భావించిన ఏపీ సర్కారు
  • తెలంగాణలో అక్టోబరు 3 నుంచే ఇస్తున్నారన్న టీచర్లు, తల్లిదండ్రులు
  • సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

ఏపీలో దసరా సెలవులకు సంబంధించి ప్రభుత్వం విద్యార్థులకు తియ్యని కబురు చెప్పింది. రాష్ట్రంలో పాఠశాలలకు అక్టోబరు 3 నుంచే సెలవులు ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 

వాస్తవానికి రాష్ట్రంలో అక్టోబరు 4 నుంచి 13 వరకు సెలవులు ఇవ్వాలని ముందు నిర్ణయించారు. అయితే, తెలంగాణలో అక్టోబరు 3 నుంచే ఇస్తున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన లోకేశ్... అక్టోబరు 3 నుంచే దసరా సెలవుల ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. 

తద్వారా ఏపీలో విద్యార్థులకు 12 రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి కాగా... ఆ రోజుతో కూడా కలుపుకుంటే అక్టోబరు 13 వరకు మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా మంత్రి నారా లోకేశ్ దసరా సెలవులపై నిర్ణయం తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News