Declaration: బతికితే జగన్ లాగా బతకాలి: పేర్ని నాని

Perni Nani take dig at alliance leaders

  • నిన్న తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్
  • డిక్లరేషన్ అంశంలో జగన్ పై తీవ్ర విమర్శలు
  • జగన్ గురించి అందరికీ తెలిసిందేనన్న పేర్ని నాని
  • చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలు చేస్తాడని ఆరోపణలు

తిరుమల డిక్లరేషన్ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. బతికితే జగన్ లాగా బతకాలని అన్నారు. జగన్ తాత తండ్రి క్రైస్తవంలోకి వచ్చాడని, వాళ్ల గురించి ఇవాళ తెలియనిది ఎవ్వరికి? అని ప్రశ్నించారు. 

బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబు గురించి పవన్ కల్యాణ్ మెచ్చుకోలుగా చెప్పడం, ఈ బీజేపీ వాళ్లు డబ్బాలు కొట్టడం అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు. హైందవ మతాన్ని, దేవుడ్ని నమ్మేవాడు బూట్లు వేసుకుని పూజలు చేస్తాడా? మనిషన్న వాడు బూట్లు వేసుకుని పూజలు చేస్తాడా? అందుకు సాక్ష్యంగా అనేక వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. దేవుడి గురించి మీరా మాట్లాడేది? 

హైందవత్వం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు... తన అమ్మ, మీ నాన్న చనిపోయినప్పుడు ఎందుకు తల వెంట్రుకలు తీయించుకోలేదు? మా అమ్మ, మా నాన్న చనిపోయినప్పుడు నేను తల వెంట్రుకలు తీయించుకున్నాను. ఏం పాటిస్తున్నారు, ఏం ఆచరిస్తున్నారు మీరు? మీరు మాట్లాడే భాష ఏంటి? 

వెంకటేశ్వరస్వామిపై నమ్మకం లేకుండానే జగన్ అన్ని సార్లు మెట్లెక్కి నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాడా? ఎవరో ఎందుకు... ఈ నెలలోనే ఒక సినిమా నటి తిరుమల వచ్చిందంట. ఆవిడ దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా మీరు? ఆవిడది క్రిస్టియన్ పేరు. ఒక ఆడకూతురు గురించి పేరెత్తి మాట్లాడకూడదు కాబట్టి, ఇప్పుడామె పేరు చెప్పడంలేదు. 

ఏపీ బీజేపీ వాళ్లు కాదు కానీ, తెలంగాణ నుంచి ఒకామె భజన చేసుకుంటూ తిరుమల వచ్చేసింది... దిక్కుమాలినతనం! మీ ఆసుపత్రిలో భజన చెయ్! బిల్లుల పేరిట మీ ఆసుపత్రిలో దోచుకుంటుంటారు... రైల్లో భజన చేసుకుంటూ వచ్చావు... నీ ఆసుపత్రిలో హిందువులకు ఒక్క రూపాయి అయినా తగ్గించావా? మీ ఆసుపత్రి భాగోతాలు తెలియదా? కరోనా సమయంలో ఎన్ని కోట్లు దోచుకున్నారో మీరు! ఒవైసీ ఆసుపత్రి గురించి మాట్లాడుతున్నావు... మీ ఆసుపత్రిలో ఒక్క హిందువుకైనా ఒక్క రూపాయి తగ్గించావా?

ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు... ప్రధాని మోదీతో పాటు ఏపీ గవర్నర్ కూడా తిరుపతి వెళ్లారు. మరి ఆయన డిక్లరేషన్ ఇచ్చారా? ఇప్పుడు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్న ఎంపీలకు ఆ రోజు నోరు ఏమైంది? మీ వెంట అన్యమతస్తుడ్ని డిక్లరేషన్ లేకుండా ఎందుకు తీసుకెళ్లారు అని మోదీని ఏమైనా ప్రశ్నించారా?" అని పేర్ని నాని నిప్పులు చెరిగారు.

Declaration
Jagan
Tirumala
Perni Nani
YSRCP
Chandrababu
TDP
BJP
  • Loading...

More Telugu News