Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కోదండరాం సహా విద్యావేత్తల బహిరంగ లేఖ

Kodandaram open letter to CM Revanth Reddy

  • అంబేద్కర్ యూనివర్సిటీ భూమిని ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి కేటాయించడంపై లేఖ
  • ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోదండరాం సహా విద్యావేత్తల డిమాండ్
  • అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం సహా పలువురు విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

పేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజుతో ఉన్నత చదువులు అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం అంబేద్కర్ యూనివర్సిటీ అని, కాబట్టి ఆ వర్సిటీ భూమిని ఇతర యూనివర్సిటీలకు కేటాయించవద్దని కోరారు. అంబేద్కర్ యూనివర్సిటీని నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. రేవంత్ రెడ్డికి లేఖ రాసిన వారిలో ఎమ్మెల్సీ కోదండరాం, హరగోపాల్, ఘంటా చక్రపాణి, దొంతి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News