Rajababu: ఆ రోజు రాజబాబుగారు ఎంతో ఏడ్చారు!

 Jagannatha Rao Interview

  • 1960లో ఎంట్రీ ఇచ్చిన పొట్టి ప్రసాద్
  • హాస్యనటుడిగా అయన ఖాతాలో అనేక చిత్రాలు  
  • రావలసినంత గుర్తింపు రాలేదన్న తనయుడు 
  • అప్పటి హీరోలంతా ఆయనను అభిమానించేవారని వెల్లడి 
  • రాజబాబు సాయం చేశారని వివరణ 

1960లలోనే ఇండస్ట్రీకి వచ్చిన నటుడు పొట్టి ప్రసాద్. చిన్న చిన్న వేషాలతో మొదలైన ఆయన కెరియర్, ఆ తరువాత పుంజుకుంది. తనదైన డైలాగ్ డెలివరీతో ఆయన ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకులను నవ్వించారు. చివరిరోజులలో ఆయన ఆర్ధికంగా ఇబ్బంది పడ్డారనే టాక్ ఉంది. అలాంటి ఆయన గురించి తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పొట్టి ప్రసాద్ తనయుడు జగన్నాథరావు మాట్లాడారు.

" మా నాన్నగారికి రావాల్సిన గుర్తింపు రాలేదనేది నా అభిప్రాయం. ఆయనంటే అప్పటి స్టార్ హీరోలందరికీ ఇష్టమే. శోభన్ బాబు లాంటి వారు, మా నాన్నకి షూటింగు లేకపోయినా సెట్ కి పిలిపించుకునేవారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులే .. సందడే. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కూడా మా నాన్న పట్ల ఎంతో అభిమానం చూపేవారు. అయితే తన పరిచయాలను అవకాశాలుగా మార్చుకోవడానికి నాన్న ఎప్పుడూ ప్రయత్నించలేదు" అన్నారు. 

" నాన్నగారు చెన్నై వచ్చినప్పుడు ఆయనకి ఆశ్రయం ఇచ్చినవారు జేవీ రమణమూర్తిగారు. నాన్నకి రావి కొండలరావు .. సాక్షి రంగారావు .. రాళ్లపల్లి మంచి స్నేహితులు. ఇక నాన్న అంటే రాజబాబుగారికి ఎంతో ఇష్టం. ఒకసారి ఆయన మా ఇంటికి వచ్చి, నాన్నకి ఏవో విషయాలు చెప్పుకుని చాలాసేపు ఏడ్చారు. నేను అప్పుడు చిన్నపిల్లాడిని కాబట్టి నాకు అర్థం కాలేదు. 'అమ్మానాన్నలను బాగా చూసుకో .. అప్పుడు అన్నీ వాటంతట అవే వస్తాయి' అని ఆయన చెప్పినమాట గుర్తుంది. మా నాన్న ఇల్లు కట్టుకోవడానికి అప్పట్లో రాజబాబుగారే సాయం చేశారు" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News