YSRCP: కూటమి సర్కార్‌లో వైసీపీ నేత సన్నిహితులకు కీలకపోస్టింగ్‌లు .. ఫిర్యాదు

Key postings for pro YCP officials

  • బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వ్యక్తగత సహయ కార్యదర్శిగా పని చేసిన ప్రతాప్ రెడ్డికి కర్నూలు జిల్లా డీఆర్‌డీఏ పీడీగా పోస్టింగ్
  • వైసీపీ నేత బంధువైన తిరుమలేశ్వరరెడ్డికి విజయవాడ నగర డీసీపీ (క్రైం) పోస్టింగ్
  • మంత్రి లోకేశ్‌ను కలిసి వారి గత చరిత్ర వివరించి పోస్టింగ్‌లు రద్ధు చేయాలని కోరుతున్న పలువురు టీడీపీ నేతలు

రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్నా పలువురు వైసీపీ నేతల సన్నిహిత అధికారులకు కీలక పోస్టింగ్‌లు దక్కుతుండటం ఇటు టీడీపీ నేతలు, అటు అధికార వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నాటి ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి వ్యక్తిగత సహాయ కార్యదర్శిగా పని చేసిన ప్రతాప్ రెడ్డికి కర్నూలు జిల్లా డీఆర్‌డీఏ పీడీగా పోస్టింగ్ లభించింది.

వైసీపీ హయాంలో కర్నూలు ప్రాంతీయ విజిలెన్స్ అధికారిగా పని చేసిన తిరుమలేశ్వరరెడ్డి కూటమి సర్కార్ లో కీలకమైన విజయవాడ నగర డీసీపీ (క్రైం) పోస్టింగ్ దక్కించుకున్నారు. ఈ పరిణామాలకు కంగుతిన్న కొందరు టీడీపీ అభిమానులు ఆ అధికారుల గత అక్రమాల చరిత్రపై మంత్రి లోకేశ్ కు లేఖ రాశారు. కొందరైతే నేరుగా లోకేశ్ ను కలిసి పోస్టింగ్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. 

ప్రతాపరెడ్డి నాటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాగా, తిరుమలేశ్వర్‌రెడ్డి మామ ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతగా గుర్తింపు పొందారు.

YSRCP
Buggana Rajendranath
AP Govt
  • Loading...

More Telugu News