Vijay Devarako: రాహుల్‌ సినిమాలో స్టనింగ్‌లుక్‌తో విజయ్‌ దేవరకొండ

Vijay Devarakonda with a stunning look in Rahuls movie

  • వరుస సినిమాలతో విజయ్‌ బిజీ 
  • విజయం కోసం ఎదురుచూపు 
  • డిఫరెంట్‌ లుక్స్‌లో ఆకట్టుకునే ప్రయత్నం

పెళ్లి చూపులు చిత్రంతో సోలో హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయాడు. గీతాగోవిందం చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ రౌడీబాయ్‌కి  ఆ తరువాత సరైన కమర్షియల్ హిట్‌ సాధించలేదు. ఇటీవల విజయ్‌ నటించిన చిత్రాలు లైగర్‌, ఖుషీ, ఫ్యామిలీస్టార్‌ కూడా ప్రేక్షకులను నిరాశపరచడంతో ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ఓ విజయం కోసం వెయిట్‌ చేస్తున్నాడు. 

ప్రస్తుతం ఈ యువ హీరో జెర్సీ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్‌ పాత్ర, గెటప్‌ వైవిధ్యంగా వుండబోతుంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. దీంతో పాటు రవికిరణ్‌ కోల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండింటితో పాటు ట్యాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం అంగీకరించాడు విజయ్‌. 

ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌, రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌, కర్నూల్‌, అనంతపూర్‌, వైఎస్‌ఆర్‌ జిల్లాలోని కొన్ని అరుదైన లోకేషన్స్‌ల్లో సినిమా చిత్రీకరణ చేస్తారట. ఈ చిత్రంలో విజయ్‌ మునుపెన్నడూ కనిపించని గెటప్‌లో వుంటాడని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఈ లుక్‌ చూసిన వారందరూ స్టన్‌ అవుతారని, ఆడియన్స్‌ కూడా ఈ గెటప్‌ ఎంతో ఫ్రెష్ ఫీల్‌ కలిగిస్తుందని అంటున్నారు. ఖచ్చితంగా ఈ మూడు చిత్రాల్లో రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలుస్తాయని విజయ్‌ అభిమానులు ఆశిస్తున్నారు. 

  • Loading...

More Telugu News