Meta: ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాకు దిమ్మదిరిగే జరిమానా

DPC imposes huge fine on Meta

  • మెటాపై కొరడా ఝళిపించిన ఐర్లాండ్
  • 2019లో కోట్లాది మంది యూజర్ల పాస్ వర్డ్ లు బహిర్గతం
  • విచారణ జరిపిన ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్
  • రూ.849 కోట్ల భారీ జరిమానా వడ్డన

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్ మాతృసంస్థ మెటాపై ఐర్లాండ్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. 2019లో కోట్లాది మంది ఫేస్ బుక్ యూజర్ల పాస్ వర్డ్ లు బహిర్గతం అయ్యాయన్న ఆరోపణలపై ఐర్లాండ్ కు చెందిన డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డీపీసీ) విచారణ జరిపింది. మెటా అనుబంధ సంస్థ మెటా ప్లాట్ ఫామ్స్ ఐర్లాండ్ లిమిటెడ్ (ఎంపీఐఎల్)పై రూ.849 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. 

తమ యూజర్ల పాస్ వర్డ్ లను అనుకోకుండా ప్లెయిన్ టెక్ట్స్ రూపంలో తమ సర్వర్లలో భద్రపరిచామని మెటా వినిపించిన వాదనలను డీపీసీ తోసిపుచ్చింది. ఎన్ క్రిప్షన్ లేకుండా, కేవలం ప్లెయిన్ టెక్ట్స్ లో యూజర్ల పాస్ వర్డ్ లను భద్రపరచరాదన్న విషయం అందరికీ తెలుసు... అలాంటి డేటాను తెరిచే వ్యక్తులు సృష్టించే ప్రమాదాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని డీపీసీ డిప్యూటీ కమిషనర్ గ్రాహమ్ డోయిల్ తెలిపారు. 

మెటాకు ఇలాంటి జరిమానాలు కొత్త కాదు. 2022లో మెటాకు డీపీసీ రూ.158 కోట్ల జరిమానా విధించింది.

  • Loading...

More Telugu News