: ప్రముఖ గాయకుడు మన్నాడేకు తీవ్ర అనారోగ్యం


ప్రముఖ నేపథ్యగాయకుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మన్నాడే(94), అలియాస్ ప్రబోద్ చంద్రాడే తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులోని ఒక ఆస్పత్రిలో చేరారు. ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కోల్ కతాలో జన్మించిన మన్నాడే హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, అసామీ భాషల్లో వందలాది పాటలకు గాత్రదానం చేశారు. 2007లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రభుత్వం మన్నాడేకు ప్రదానం చేసింది.

  • Loading...

More Telugu News