Johnny Master: పోలీస్ కస్టడీలో కీలక విషయాలను వెల్లడించిన జానీ మాస్టర్...?

Johnny Master reveals big things in Police custody

  • బాధితురాలి ఆరోపణలు నిరాధారమైనవన్న జానీ మాస్టర్
  • ఆమెతో తానే ఇబ్బందులు పడ్డానన్న జానీ మాస్టర్
  • ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు వెల్లడి

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు. అతనిని పోలీసులు మూడోరోజు కస్టడీకి తీసుకున్నారు. రికార్డ్ చేసిన బాధితురాలి స్టేట్‌మెంట్‌ను అతని ముందు ఉంచి పోలీసులు విచారణ జరిపారు. విచారణలో జానీ మాస్టర్ షాకింగ్ విషయాలు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మీడియా కథనాల మేరకు.... ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని విచారణలో జానీ మాస్టర్ తెలిపాడు. ఆమె మైనర్‌గా ఉన్న సమయంలో వేధింపులకు గురి చేసిన మాట అవాస్తవమని చెప్పాడు. 'ఢీ' షో ద్వారా పరిచయమైనట్లు చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని తనను చాలాసార్లు అడిగిందని, తనను ఇబ్బందులకు గురి చేసిందని చెప్పాడు.

బాధితురాలి తీరుతో తాను పడిన బాధలను దర్శకుడు సుకుమార్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు పోలీసులకు చెప్పాడు. ఆమెను పిలిచి కూడా సుకుమార్ మాట్లాడినట్లు చెప్పాడు. తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ పోలీసులకు చెప్పాడు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించినట్లు చెప్పాడు.

Johnny Master
Telangana
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News