Jagan: జగన్ తిరుమల పర్యటన రద్దు

Jagan Tiruamala visit canceled

  • కొనసాగుతున్న శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం
  • నేడు తిరుమల చేరుకుని, రేపు శ్రీవారిని దర్శించుకోవాలని భావించిన జగన్
  • చివరి నిమిషంలో పర్యటన రద్దు నిర్ణయం!

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే, గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని కూటమి పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తున్నాయి. 

మరోవైపు, జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో, జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా...? అనే అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలో, జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాసేపట్లో జగన్ మీడియా ముందుకు వస్తారని తెలుస్తోంది.

Jagan
Tirumala
YSRCP
Laddu Row
  • Loading...

More Telugu News