Abhishek: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అభిషేక్ అరెస్ట్

Actor Abhishek arrested in drugs case

  • అభిషేక్ పై ఇప్పటికే పలు కేసులు
  • గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న అభిషేక్
  • అభిషేక్ ను విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు అభిషేక్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్ పై జూబ్లీహిల్స్, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. 2012 నుంచి డ్రగ్స్ కేసుల్లో ఆయన పలు దఫాలుగా అరెస్ట్ అయ్యారు. డ్రగ్స్ కేసులు మొదలైన తర్వాత ఆయనకు సినిమాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు అవకాశాలు పూర్తిగా లేకపోవడంతో ఆయన గోవాకు వెళ్లి రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. 

అయితే, కోర్టు వాయిదాలకు ఆయన హాజరు కాకపోవడంతో... ఆయనపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో అభిషేక్ గురించి పోలీసులు వెతకగా... గోవాకు వెళ్లి రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. అక్కడకు వెళ్లిన పోలీసులు ఆయనను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని సీసీఎస్ కు తరలించి విచారణ జరుపుతున్నారు.

Abhishek
Tollywood
Drugs
  • Loading...

More Telugu News