Balineni Srinivasa Reddy: జనసేనలో చేరిన బాలినేని, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య... కండువా కప్పిన పవన్ కల్యాణ్

Balineni joins Janasena party in the presence of Pawan Kalyan

  • ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి
  • నేడు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిక
  • సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య కూడా జనసేనలోకి ఎంట్రీ
  • పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్న పవన్

జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో... బాలినేనికి అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి, జనసేనలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఇటీవలే బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక, వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య కూడా బాలినేనితో పాటు ఇవాళ జనసేన పార్టీలో చేరారు. ఉదయభాను, కిలారి రోశయ్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పవన్ వారికి సూచించారు.

More Telugu News