Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • మెటల్స్, ఆటో స్టాక్స్ మద్దతుతో పుంజుకున్న మార్కెట్లు
  • 666 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 212 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల మధ్య ఈ ఉదయం ట్రేడింగ్ ఫ్లాట్ గా ప్రారంభమయింది. ఆ తర్వాత మెటల్స్, ఆటో స్టాక్స్ మద్దతుతో సూచీలు పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 666 పాయింట్ల లాభంతో 85,836కి ఎగబాకింది. నిఫ్టీ 212 పాయింట్లు పెరిగి 26,216 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (4.76%), టాటా మోటార్స్ (3.08%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.97%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.91%), టాటా స్టీల్ (2.48%).

బీఎస్ఈ లో ఎల్ అండ్ టీ (-0.90%), ఎన్టీపీసీ (-0.44%) మాత్రం నష్టపోయాయి.

  • Loading...

More Telugu News