Karnataka: మీడియా ప్రతినిధులపై కర్ణాటక సీఎం అసహనం

Karnataka CM says he will not resign

  • ముడా స్కాంలో సిద్ధరామయ్యపై ఆరోపణలు
  • సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి
  • గవర్నర్ అనుమతివ్వడం చట్టబద్ధమేనన్న హైకోర్టు
  • సిద్ధూ రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ డిమాండ్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాపై సహనం కోల్పోయారు. మీడియా ప్రతినిధుల మైక్‌ను పక్కకు తోసేశారు. అవసరమైతే తాను మీడియాను పిలిచి మాట్లాడుతానని తెలిపారు. కర్ణాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్కాంలో సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన ముడా స్కాంలో సిద్ధరామయ్యను విచారించడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లగా, గవర్నర్ అనుమతి ఇవ్వడం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాఫ్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్షాల డిమాండ్‌పై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడగగా... సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. 

రాజీనామా చేసేది లేదు

తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. గతంలో మాజీ సీఎం కుమారస్వామిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేయలేదన్నారు. "నేను రాజీనామా చేయను... ఎందుకు రాజీనామా చేయాలి?" అని ప్రశ్నించారు. మొదట కుమారస్వామిని రాజీనామా చేయనీయండన్నారు.

Karnataka
Siddaramaiah
Chief Minister
BJP
  • Loading...

More Telugu News