Raghu Rama Krishna Raju: జగన్ క్రిస్టియన్... తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే: రఘురామకృష్ణరాజు

Jagan is a Christian says Raghu Rama Krishna Raju

  • తిరుమలలో అన్యమతస్తులు రూల్స్ పాటించాల్సిందేనన్న రఘురామ 
  • శ్రీవారి పట్ల విశ్వాసం ఉందని జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ
  • పాప పరిహారం కోసం జగన్ ను స్వామివారు తిరుమలకు పిలిచారని వ్యాఖ్యలు

వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న సంగతి తెలిసిందే. 27న ఆయన అలిపిరి నడక దారిలో తిరుమలకు చేరుకుని... 28న శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో జగన్ ను ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

జగన్ క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలిసిందేనని రఘురాజు అన్నారు. అన్య మతస్తులు ఎవరు తిరుమలకు వెళ్లినా రూల్స్ పాటించాల్సిందేనని చెప్పారు. హిందూమతం పట్ల, స్వామివారి పట్ల విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. తిరుమల లడ్డూను వాసన చూసి వదిలేయకుండా నిండు విశ్వాసంతో లడ్డూను తినాలని చెప్పారు. 

తప్పు చేసిన జగన్ ను పాప పరిహారం చేసుకోవడానికి వేంకటేశ్వరస్వామి తిరుమలకు పిలిచినందుకు సంతోషంగా ఉందని రఘురాజు అన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత స్వామివారి లడ్డూని స్వచ్ఛమైన నేతితో అద్భుతంగా చేయిస్తున్నారని కొనియడారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఎలాంటి దోషాలు జరగకుండా హిందూ మనోభావాలకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

Raghu Rama Krishna Raju
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News