Madhavi Latha: వందేభారత్ రైల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు మాధవీలత భజన... వీడియో ఇదిగో!

Madhavi Latha recites Bhajans while traveling in Vande Bharat train from Secunderabad to Tirupati

  • సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు రైల్లో ప్రయాణం చేసిన మాధవీలత
  • మాధవీలత భజనతో మార్మోగిన వందేభారత్ రైలు
  • మాధవీలత అనుచరులతో నిండిపోయిన ఓ కంపార్ట్ మెంట్

తెలంగాణ బీజేపీ నేత మాధవీలత వందేభారత్ రైల్లో హరే రామ హరే కృష్ణ అంటూ భజన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మాధవీలత సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వందేభారత్ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె రైల్లో ఆ చివర నుంచి ఈ చివర వరకు భజన చేస్తూ తిరిగారు. 

ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు.  సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్ మెంట్ మాధవీలత అనుచరులతో నిండిపోయింది. ఆమె కాసేపు గోవిందా గోకుల నందా అంటూ కూడా భజన చేశారు.

More Telugu News