Kollu Ravindra: పేర్ని నానీ... గుడివాడలో కొట్టినా బుద్ధి రాలేదా? పళ్లు రాలిపోతాయ్: కొల్లు రవీంద్ర

Kollu Ravindra fires on Perni Nani

  • జగన్ కు వేంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేదన్న రవీంద్ర
  • జగన్ ను వెనకేసుకురావడానికి సిగ్గుగా లేదా అని నానికి ప్రశ్న
  • నోటికొచ్చినట్టు వాగితే బుద్ధి చెపుతామని హెచ్చరిక

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... రవాణా శాఖ మంత్రిగా పని చేసినప్పటికీ... బందరు బస్టాండ్ ను అభివృద్ధి చేయలేదని... ఇప్పుడు లడ్డూ అంశంలో పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే పళ్లు రాలిపోతాయని హెచ్చరించారు. 

మీ అధినేత జగన్ కు కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిపై విశ్వాసం లేదు... అలాంటి వ్యక్తిని వెనకేసుకురావడానికి నీకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామిపై నమ్మకం ఉంటే స్వామివారికి ఐదేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారా? అని నిలదీశారు. 

మొన్న గుడివాడలో నిన్ను జనాలు కొట్టినా సిగ్గు రాలేదా? అని ఎద్దేవా చేశారు. ఈసారి బందరు ప్రజలు నిన్ను తరిమి కొడతారని చెప్పారు. ఇంకోసారి నోటికొచ్చినట్టు వాగితే... నోరు మూసుకునేలా బుద్ధి చెపుతామని హెచ్చరించారు. 

పేర్ని నాని ఏమన్నారంటే..

"తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేస్తున్నారు. స్వామి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. చంద్రబాబు, లోకేశ్ లవి దుర్మార్గపు మాటలు. ఆ మాటలను పవన్ కల్యాణ్ భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నాడు. కూటమి నేతలు తిరుమల పవిత్రతను అపవిత్రం చేశారు. కూటమి నేతల పాపాలను క్షమించి వదిలేయాలని ఈ నెల 28న పూజలు చేస్తాం" అని పేర్ని నాని అన్నారు.

Kollu Ravindra
Telugudesam
Perni Nani
YSRCP
Jagan
  • Loading...

More Telugu News