Harsha Sai: యూట్యూబర్ హర్షసాయి కేసు.. లీకైన ఆడియో ఇదిగో!

Youtuber Harsha Sai Audio Leak

  • ఓ ఆడియోలో క్లోజ్ గా మాటలు.. మరో ఆడియోలో ఫైటింగ్
  • పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ హర్షసాయిపై యువతి ఆరోపణలు
  • ఆడియో రికార్డింగ్ లు పోలీసులకు అందజేసి ఫిర్యాదు

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లొంగదీసుకోవడంతో పాటు రూ.2 కోట్లు తీసుకున్నాడని ఆరోపించింది. దీనిపై మంగళవారం నార్సింగి పోలీస్ స్టేషన్ లో యువతి ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి హర్షసాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై హర్షసాయి ఓ వీడియో విడుదల చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సదరు యువతి డబ్బుల కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని, తనేమిటో తన అభిమానులకు తెలుసని చెప్పాడు. త్వరలోనే నిజం బయటపడుతుందని, ఈ విషయంలో ఇకపై తన లాయర్ మాట్లాడతారని వీడియోలో చెప్పాడు.

తాజాగా ఈ కేసుకు సంబంధించి బాధిత యువతికి, హర్షసాయికి మధ్య జరిగిన పలు ఫోన్ కాల్స్ రికార్డులు లీక్ అయ్యాయి. ఈ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు కాల్స్ కు సంబంధించిన ఆడియోలు ట్విట్టర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఒకదాంట్లో బాధిత యువతి, హర్షసాయి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరూ గట్టిగా వాదించుకోవడం వినిపిస్తోంది. మరో ఆడియోలో బాధిత యువతి హర్షసాయితో క్లోజ్ గా మాట్లాడగా.. హర్షసాయి ‘ఊ ఆ’ అంటూ సరిపెట్టడం వినిపించింది. ఈ ఆడియోలను బాధితురాలు పోలీసులకు అందజేసినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు ఇవ్వాలంటూ పోలీసులు కోరారని సమాచారం.

Harsha Sai
Audio
Cheating Case
mumbai Actress

More Telugu News