insurance lok adalat: అక్టోబర్ మొదటి వారంలో విజయవాడలో 'ఇన్సూరెన్స్ లోక్ అదాలత్'

insurance lok adalat in the first week of october

  • అక్టోబర్ 1 నుండి 7వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అదాలత్
  • బుడమేరు వరదల్లో దెబ్బతిన్న మోటారు వాహనాల బీమా క్లైమ్‌ల పరిష్కారానికి వేదిక  
  • బాధితులకు సాధ్యమైనంత మేర మేలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి 

ఈ నెల మొదటి వారంలో సంభవించిన బుడమేరు వరదల వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయిన కారణంగా దెబ్బతిన్న పలు మోటారు వాహనాల బీమా క్లైమ్‌ల సత్వర పరిష్కారానికై వచ్చే నెల 1 నుండి 7 వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అధాలత్‌ను నిర్వహించనున్నామని, వరద బాధితులందరూ ఈ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) ఎమ్.బబిత విజ్ఞప్తి చేశారు. 

ఈ మేరకు బుధవారం రాష్ట్ర సచివాలయం సమీపంలో గల రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బీమా కంపెనీలు, ఆటోమొబైల్ బాడీ షాప్స్ మరియు ఆటో డ్రైవర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మోటారు వాహనాల బీమా క్లైమ్ల సత్వర పరిష్కార అంశంలో ఎదురవుతున్న పలు సమస్యలు, వాటి పరిష్కారానికై తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు కార్య నిర్వాహక అధ్యక్షులు, న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ ఆదేశాల మేరకు ఈ ఇన్సూరెన్సు లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోటారు వాహనాల బీమా క్లైమ్లకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ సానుకూలంగా పరిశీలిస్తూ బాధితులకు సాధ్యమైనంత మేర మేలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని బీమా కంపెనీల ప్రతినిధులను ఆమె కోరారు.

  • Loading...

More Telugu News