Asaduddin Owaisi: తిరుమల లడ్డూ వివాదంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు

MIM Chief Owaisi comments on Tirumala Laddu row

  • తిరుమల లడ్డూ కల్తీ బాధాకరమన్న ఒవైసీ
  • కల్తీ జరగకుండా ఉంటే బాగుండేదని వెల్లడి
  • వక్ఫ్ బోర్డులో హిందువులను ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్న

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి దేశవ్యాప్తంగా ప్రకంకపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తిరుమల లడ్డూ తయారీకి వినియోగంచే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటున్నారని, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసి ఉంటే తప్పేనని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ కావడం బాధాకరమని, అలా జరగకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 

మరి, వక్ఫ్ చట్టాన్ని సవరించి బోర్డు మెంబర్లుగా హిందువులను నామినేట్ చేస్తామంటున్నారని, ఇది తప్పు కాదా? అని ఒవైసీ నిలదీశారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డులో హిందువులను సభ్యులుగా తీసుకువస్తామనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 

హిందూ దేవాలయాలకు హిందువులను మాత్రమే చైర్మన్లుగా నియమిస్తున్న ప్రభుత్వాలు... వక్ఫ్ బోర్డులో ఎలా కలుగజేసుకుంటాయని అన్నారు.

  • Loading...

More Telugu News