VH: పార్టీలోకి వచ్చిన నాలుగేళ్లలో సీఎం కావడం చరిత్రలో లేదు... కానీ రేవంత్ రెడ్డి అయ్యారు: వీహెచ్

VH suggetion to Revanth Reddy

  • బీసీ నేతను పీసీసీ చీఫ్‌గా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్న వీహెచ్
  • బీసీల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినట్లుగా ఎవరూ మాట్లాడలేదని వ్యాఖ్య
  • కులగణన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్న వీహెచ్

పార్టీలోకి వచ్చిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి కావడం ఇక్కడి చరిత్రలో లేదని, కానీ రేవంత్ రెడ్డి అయ్యారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. 

హోటల్ హరిత ప్లాజాలో కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా సమగ్ర కులగణన, బీసీ రిజర్వేషన్ పెంపుపై రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ... బీసీ నేతను పీసీసీ చీఫ్‌గా చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. తన రాజకీయ జీవితంలో బీసీల గురించి రాహుల్ గాంధీ మాట్లాడినట్లు ఎవరూ మాట్లాడలేదన్నారు.

జనాభా ప్రాతిపదికన ఎవరి హక్కులు వారికే దక్కాలని రాహుల్ గాంధీ చెప్పారని పేర్కొన్నారు. కులగణన చేయాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీజేపీని కోరినప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలోని ఆరు డిక్లరేషన్లతో పాటు బీసీ కులగణన చేపడతామని పార్టీ చెప్పిందన్నారు. బీసీ డిక్లరేషన్ అనగానే గత ఎన్నికల్లో కులాలకు అతీతంగా ఓటు వేశారన్నారు.

కులగణన చేయాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు. రేవంత్ రెడ్డి పక్కన చెప్పేవారు ఎక్కువ అయ్యారని పేర్కొన్నారు. అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లు పాస్ అయిందని, త్వరలో మనకు న్యాయం జరుగుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ త్వరగా బీసీ కులగణన చేస్తేనే రాహుల్ గాంధీ ఎక్కడైనా మాట్లాడగలుగుతారన్నారు. లేదంటే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేయాలని ఇతర పార్టీలు సూచిస్తాయన్నారు.

  • Loading...

More Telugu News