Johnny Master: జానీ మాస్టర్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు

Court granted permission for Johnny Master custody

  • జానీ మాస్టర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దన్న కోర్టు
  • అవసరమైతే న్యాయవాదుల సమక్షంలో విచారించాలని సూచన
  • ఈ నెల 28 వరకు జానీ మాస్టర్‌ను విచారించనున్న పోలీసులు

లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆయనపై థర్డ్ డిగ్రీని ప్రయోగించవద్దని, అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది. నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు.

తనను మోసం చేశాడని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేసి పీటీ వారెంట్‌పై హైదరాబాద్ కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు.

  • Loading...

More Telugu News