Prakash Raj: పవన్ కల్యాణ్ కు మరోసారి కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్

Prakash Raj satires on Pawan Kalyan

  • సినీ పరిశ్రమలో రచ్చకు దారి తీసిన లడ్డూ అంశం
  • పవన్ కు క్షమాపణ చెప్పిన హీరో కార్తీ
  • చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటోనన్న ప్రకాశ్ రాజ్

తిరుమల లడ్డూ వ్యవహారం సినీ పరిశ్రమలో రచ్చకు దారి తీసేలా ఉంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు మధ్య వివాదం చెలరేగింది. పూర్తి వివరాలు తెలుసుకోకుండా... తిరుమల లడ్డూ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రకాశ్ రాజ్ ను పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని... 30వ తేదీ తర్వాత వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమధానాలు చెపుతానని ఎక్స్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు. 

మరోవైపు హీరో కార్తీ తాజా చిత్రం 'సత్యం సుందరం' ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో 'లడ్డూ'పై జరిగిన చర్చ వైరల్ అయింది. దీనిపై పవన్ స్పందిస్తూ... లడ్డూ మీద ఒక సినిమా ఫంక్షన్ లో జోకులేశారని మండిపడ్డారు. అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. దీంతో, పవన్ కు కార్తీ క్షమాపణ చెప్పారు. వేంకటేశ్వరస్వామి భక్తుడిగా తాను ఎప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తానని అన్నారు. 

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు ప్రకాశ్ రాజ్ మరోసారి ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్..' అంటూ దెప్పిపొడిచారు. ఈ వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Prakash Raj
Pawan Kalyan
Kathi
Tollywood
Janasena
  • Loading...

More Telugu News