Comet: 80 వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వస్తున్న తోకచుక్క.. శుక్రవారం ఆకాశంలో కనిపించనున్న అరుదైన అతిథి

Bright Space Rock To Light Up Sky This Week Comet To Visit After 80000 Years

  • ప్రపంచంలో ఏమూలన ఉన్నా చూడొచ్చని చెబుతున్న శాస్త్రవేత్తలు
  • జీవితకాలంలో ఒక్కసారే వచ్చే అత్యంత అరుదైన క్షణమని వెల్లడి
  • అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో తీసి పంపిన నాసా వ్యోమగామి 

ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం మామూలే.. అయితే, ఈ నెల 28న అత్యంత అరుదైన తోక చుక్క కనిపించనుందని ఖగోళ పరిశోధకులు చెబుతున్నారు. దాదాపు 80 వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చూసిన ఓ తోక చుక్క మళ్లీ ఇప్పుడు దర్శనమివ్వబోతోందన్నారు. అప్పట్లో సూర్యుడికి దగ్గరగా వచ్చిన ఈ తోకచుక్కను కామెట్ సి/2003 ఏ3 గా వ్యవహరిస్తున్నారు. శుచిన్ షాన్ - అట్లాస్ అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి దగ్గరగా రానుందని, శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పారు.

ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ తోకచుక్కను ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే నేరుగా మన కళ్లతో చూడొచ్చని తెలిపారు. బైనాక్యులర్ తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. మన జీవితకాలంలో అత్యంత అరుదుగా వచ్చే అద్భుతమని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి మాథ్యూ డొమినిక్ ఈ తోకచుక్కను వీడియో(టైమ్ లాప్స్ వీడియో)లో బంధించి పంపించాడు. ఈ నెల 28 న ఆకాశంలో కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ 10న కూడా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News