K Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసు.. కోర్టు విచారణకు హాజరైన కవిత

Kavitha attended court trial virtulally

  • సీబీఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు
  • వర్చువల్ గా కోర్టు విచారణకు హాజరైన కవిత
  • తదుపరి విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు కోర్టు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. ఈ విచారణకు కవితతో పాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు కూడా హాజరయ్యారు. కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. 

ప్రతివాదులకు సీబీఐ అందజేసిన ప్రతులు సరిగా లేవని విచారణ సందర్భంగా కోర్టుకు న్యాయవాదులు తెలిపారు. దీంతో, సరైన ప్రతులను ప్రతివాదులకు అందజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత ప్రస్తుతం బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 27వ తేదీన కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

K Kavitha
BRS
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News