: మట్టపల్లి ఆలయం గాలిగోపురంపై పిడుగు


ప్రముఖ నారసింహ క్షేత్రంలో అపచారం జరిగింది. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం, మట్టపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ గాలిగోపురంపై నిన్న రాత్రి పిడుగు పడింది. దీంతో గోపురభాగం కొంత దెబ్బతింది. పిడుగు శబ్ధానికి ఆలయంలో పడుకున్న భక్తులు సహా, సమీపంలోని వారు బయటకు వచ్చారు. దెబ్బతిన్న భాగాన్ని సరిచేస్తామని ఆలయ ఈవో తెలిపారు.

  • Loading...

More Telugu News