Devara Movie: 'దేవర' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దుతో విధ్వంసం.. నిర్మాతలకు సరికొత్త తలనొప్పులు

New headache for Devara movie producers

  • గత ఆదివారం జరగాల్సిన 'దేవర' ప్రీరిలీజ్ ఈవెంట్
  • కెపాసిటీకి మించి పోటెత్తిన అభిమానులు
  • హోటల్ లోని ఫర్నిచర్ ను, సామగ్రిని ధ్వంసం చేసిన ఫ్యాన్స్

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ 'దేవర' ప్రీరిలీజ్ ఈవెంట్ గత ఆదివారం హైదరాబాద్ లోని నొవోటెట్ హోటల్ జరగాల్సి ఉంది. అయితే కెపాసిటీకి మించి అభిమానులు పోటెత్తడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. హోటల్ లోని ఫర్నిచర్ ను, సామగ్రిని ధ్వంసం చేశారు. తోపులాటలో హోటల్ లోని అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో నిర్మాతలకు సరికొత్త తలనొప్పులు వచ్చాయి. 

అభిమానుల ఆగ్రహజ్వాలలతో హోటల్ కు భారీ నష్టం వాటిల్లింది. తమకు వాటిల్లిన నష్టాన్ని చెల్లించాలని 'దేవర' నిర్మాతలను హోటల్ యాజమాన్యం కోరింది. తమకు రూ. 33 లక్షల నష్టం వాటిల్లినట్టు హోటల్ యాజమాన్యం లెక్కకట్టింది. కుర్చీలకే రూ. 7 లక్షల వరకు అయినట్టు సమాచారం. దీంతో పాటు మెయిన్ గ్లాస్, ఎలివేటర్ గ్లాస్, కొన్ని డోర్లు కూడా ధ్వంసమయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. మరోవైపు బిల్లును కాస్త తగ్గించాలని హోటల్ యాజమాన్యాన్ని నిర్మాతలు కోరినట్టు సమాచారం.

Devara Movie
Pre Release Event
Novotel
  • Loading...

More Telugu News