Anish Kuruvilla: అందుకే పెళ్లి చేసుకోలేదు: నటుడు అనీష్ కురువిల్లా

Anish Kuruvilla Interview

  • చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమన్న అనీష్  
  • కాలేజ్ రోజుల్లోనే డైరెక్షన్ పై దృష్టి పెట్టానని వ్యాఖ్య 
  • పెళ్లి గురించి ఆలోచన చేయలేదని వివరణ


అనీష్ కురువిల్లా .. కేరక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నటుడు. మంచి పర్సనాలిటీ .. ఆకట్టుకునే డైలాగ్ డెలివరీ ఆయన సొంతం. ఆయన ఎంచుకునే పాత్రలు కూడా చాలా హుందాగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఆయన తనకి సంబంధించిన విషయాలను, 'హిట్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 

"చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే ఇష్టం. కాలేజ్ రోజుల్లో సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. అదే సమయంలో నా దృష్టి డైరెక్షన్ దిశగా వెళ్లింది. ఒక వైపున నటిస్తూనే, మరో వైపున డైరెక్షన్ పై దృష్టిపెట్టాను. నటుడిగా 'ఆనంద్' .. ' గోదావరి' .. 'గూఢచారి' .. 'పెళ్లి చూపులు' వంటి సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి" అని అన్నారు. 

"నేను పెళ్లి చేసుకోలేదు .. పెళ్లి అనేది నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకోమని మా ఇంట్లో వాళ్లు చాలాసార్లు చెప్పారు. కానీ ఎందుకో పెళ్లి అనేది నాకు సెట్ కాదని అనిపించింది. అందువల్లనే నేను దాని గురించిన ఆలోచన చేయలేదు. ఇక మా ఇంట్లో వాళ్లు కూడా నా నిర్ణయానికే వదిలేశారు. ప్రస్తుతం నేను నా కెరియర్ గురించే ఆలోచిస్తున్నాను" అని చెప్పారు. 

Anish Kuruvilla
Aanand
Godavri
pelli Chupulu
  • Loading...

More Telugu News