Rain Alert: తెలంగాణలోని ఈ ఏడు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

Heavy Rains In Telangana 7 Districts Today

  • మధ్య, బంగాళాఖాతంలో అల్పపీడనం
  • దాని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు
  • దేవరుప్పలలో నిన్న అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వాన

గతమూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3, 4 రోజులు వానలు ఉన్నాయని వాతావరణశాఖ ఇది వరకు పేర్కొంది. నేడు ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. 

మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

కాగా, నిన్న జనగామ జిల్లా దేవరుప్పలలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో అత్యల్పంగా 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News