Revanth Reddy: చెరువులు ఆక్రమణకు గురికాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy suggest CC camaras at ponds

  • మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, మెట్రో రైలుపై సీఎం సమీక్ష
  • మూసీ ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సూచన
  • వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ఆదేశం
  • నిర్వాసితులను గుర్తించి ఇచ్చేందుకు 16,002 డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తూ ఉత్తర్వులు

చెరువులు ఆక్రమణకు గురికాకుండా పర్యవేక్షిందుకు ఆయా చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారును ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, మెట్రోరైలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే పేదల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. వారికి డబుల్ బెడ్రూం ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. సమీక్షలో సంబంధిత అధికారులతో పాటు హైడ్రా కమిషనర్ ఉన్నారు.

డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

మూసీ అభివృద్ధి ప్రాజెక్టులోని నిర్వాసితులకు 16,002 డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ పరివాహక ప్రాంతంలో 10,200 మంది నిర్వాసితులు కానున్నట్లు గుర్తించింది. బుధవారం ఇంటింటికి వెళ్లి ఇళ్ల కేటాయింపుకు సంబంధించి వివరాలను నిర్వాసితులకు తెలియజేయనున్నారు. మూసీ బఫర్ జోన్‌లో నివసించే వ్యక్తులకు పునరావాసం ఏర్పాటు చేయాలని, నిర్మాణాలకు పరిహారం చెల్లించాలని నిర్ణయించారు.

Revanth Reddy
Hyderabad
HYDRA
  • Loading...

More Telugu News