Bandi Sanjay: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు మద్దతు ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

Union Minister Bandi Sanjay supports AP Deputy CM Pawans comments on Sanatana Dharma

  • సనాతన ధర్మంపై పవన్ వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ ఎంపీ
  • పవన్ శక్తిమంతమైన మాటలు మాట్లాడారన్న బండి సంజయ్
  • సనాతనం ధర్మ జోలికొస్తే మౌనంగా ఉండబోమన్న కేంద్ర సహాయ మంత్రి

"హిందూ ధర్మం జోలికి ఎవరూ రావొద్దు. హిందువులకు మనోభావాలు ఉండవా? ఆలయాలలో అపవిత్రమైన పనులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా... సనాతన ధర్మంపై అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు" అంటూ ఇవాళ (మంగళవారం) ఇంద్రకీలాద్రి వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా, పవన్ కల్యాణ్ కు కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శక్తిమంతమైన మాటలు మాట్లాడారని, సంపూర్ణంగా ఆయనకు మద్దతుగా నిలుస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు.‘‘ సనాతన ధర్మంతో ఎవరైనా పెట్టుకుంటే మా హిందువులమంతా న్యాయబద్ధంగా గొంతు విప్పుతాం. లౌకికవాదం అనేది రెండు మార్గాలు ఉన్న వీధి లాంటిది. ఇతరులు మమ్మల్ని కొడుతుంటే దెబ్బలు తింటామని భావిస్తున్నారేమో అది జరగదు. పంచింగ్ బ్యాగ్స్ మాదిరిగా మౌనంగా ఉండబోము’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందించారు. ‘‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్. ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అని జోడించారు.

More Telugu News