China: మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన టాలీవుడ్ ప్రముఖులు వీరే!

List of Tollywood celebs achieved Guinness records

  • ఇటీవలే గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన చిరంజీవి
  • 156 సినిమాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో మెగాస్టార్ రికార్డ్
  • ఇప్పటికే గిన్నిస్ రికార్డులు సాధించిన దాసరి, ఎస్పీ బాలు, రామానాయుడు తదితరులు

మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. 156 సినిమాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో ఆయన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ నెల 22న హైదరాబాద్ లో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవికి అవార్డును అందజేశారు. మరోవైపు చిరంజీవి కంటే ముందు గిన్నిస్ రికార్డును సాధించిన ప్రముఖులు మరికొందరు ఉన్నారు. వారెవరో తెలుసుకుందాం. 

గిన్నిస్ రికార్డులు సాధించిన టాలీవుడ్ ప్రముఖులు:
దాసరి నారాయణరావు: తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు సాధించారు. 53 సినిమాలను స్వయంగా నిర్మించిన ఘనత కూడా ఆయనది. 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠా భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. 

దగ్గుబాటి రామానాయుడు: 100కు పైగా చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. 

విజయనిర్మల: 200కు పైగా చిత్రాల్లో నటించిన విజయనిర్మల డైరెక్టర్ గా 44 సినిమాలను తెరకెక్కించారు. ప్రపంచంలో అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్ రికార్డును సాధించారు. 

పి. సుశీల: సుశీల 12 భాషల్లో దాదాపు 30 వేల పాటలు పాడినట్టు అంచనా.. అయితే గిన్నిస్ బుక్ వారు 1960 నుంచి 6కు పైగా భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ పాటలను పరిగణనలోకి తీసుకుని ఆమెను గిన్నిస్ రికార్డుల్లోకి చేర్చారు.

బ్రహ్మానందం: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఒకే భాషలో 754 చిత్రాలలో నటించినందుకు గాను ఆయనను గిన్నిస్ రికార్డు వరించింది.

  • Loading...

More Telugu News