Devara: 'దేవర' దర్జా .. అభిమానుల్లో కొత్త రికార్డుల చర్చ!

Devara Movie Update

  • 'దేవర'గా వస్తున్న ఎన్టీఆర్ 
  • ఆయన జోడీగా ఎంట్రీ ఇస్తున్న జాన్వీ
  • ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ పట్ల ఫ్యాన్స్ ఆసక్తి  
  • మంచి మార్కులు కొట్టేసిన అనిరుధ్ బీట్స్
  • కొరటాల - ఎన్టీఆర్ కాంబోలో ఇది రెండో సినిమా


ఎన్టీఆర్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'దేవర'పైనే ఉంది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. హైదరాబాదులో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఒక రేంజ్ లో ఉంది. క్షణాల్లో షోస్ ఫుల్ అవుతున్నాయి. టికెట్ల రేటు పెంచినా అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మల్టీ ప్లెక్స్ లో అన్ని స్క్రీన్లను ఈ సినిమానే ఆక్రమిస్తూ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. అభిమానుల తాకిడి తట్టుకోలేక ప్రీరిలీజ్ ఈవెంటును కేన్సిల్ చేయడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కి ఒక నిదర్శనంగా భావించాలి. 'దేవర'కి ఈ క్రేజ్ ఇప్పుడు వచ్చిందేం కాదు, టైటిల్ తోనే ఈ జోరు మొదలైంది. టైటిల్ తేలికైన అక్షరాలతో ఉండటం .. అది పవర్ఫుల్ గా ఉండటం ప్లస్ అయింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. గతంలో ఆయన మూడు పాత్రలను కూడా చేశాడు. అయితే ఈ సినిమాలోని పాత్రల మధ్య కనిపించే వైవిధ్యం వేరు. అటు మధ్య వయసు లుక్ .. ఇటు యంగ్ లుక్ లో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తూ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. యంగ్ లుక్ లో .. హాఫ్ హ్యాండ్స్ లో ఎన్టీఆర్ మరింత ఫ్రెష్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇక హీరోయిన్ గా శ్రీదేవి ఎన్ని భాషల్లో చేసినా, ఆమెను తెలుగింటి సౌందర్యంగానే చూస్తాము. మా శ్రీదేవి కూతురనే అభిమానం సహజంగానే జాన్వీ కపూర్ పై ఉంటుంది. అందువలన ఆమె ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా చెప్పుకోవాలి. ఎన్టీఆర్ .. జాన్వీ జోడి పాటలతో చేసిన సందడి ప్రేక్షకులను ఊరిస్తూనే ఉంది. గతంలో ఎన్టీఆర్ - కొరటాల చేసిన 'జనతా గ్యారేజ్' సాధించిన భారీ విజయం ప్రభావం కూడా ఈ సినిమాపై ఉంది. ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ మొదలు ప్రతి కేటగిరిలో నెలకొల్పనున్న రికార్డులను గురించిన చర్చలతో అభిమానుల హడావిడి ఆల్రెడీ మొదలైపోయింది. 

  • Loading...

More Telugu News