TTD Laddu: తిరుమల లడ్డూ వివాదం... అమ్మకాలపై ప్రభావం చూపలేదంటున్న టీటీడీ

Amid Animal Fat Row 14 Lakh Tirupati Laddoos Sold In 4 Days
  • 4 రోజుల్లో 14 లక్షల లడ్డూలు విక్రయించామన్న అధికారులు
  • రోజుకు సగటున 3.5 లక్షల లడ్డూలు కొనుగోలు చేసిన భక్తులు
  • జంతు కొవ్వు వివాదాన్ని భక్తులు గతం గతః అని భావించారన్న ఆలయ సిబ్బంది
తయారీలో కల్తీ, జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, శ్రీవారి ప్రసాదం లడ్డూల విక్రయంపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో మొత్తం 14 లక్షల లడ్డూలు విక్రయించామని వివరించారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు లడ్డూలపై వచ్చిన వివాదాన్ని గతం గతః అని భావించారని, యథావిధిగానే ప్రసాదాలను కొనుగోలు చేశారని చెప్పారు. అధికారుల వివరాల ప్రకారం... ఈ నెల 19న 3.59 లక్షల లడ్డూలు, ఈ నెల 20న 3.17 లక్షల లడ్డూలు, ఈ నెల 21న 3.67 లక్షల లడ్డూలు, ఈ నెల 22న 3.60 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయని వివరించారు. సగటున రోజుకు 3.50 లక్షల లడ్డూలు విక్రయించామని పేర్కొన్నారు.
TTD Laddu
Sales not Hit
laddu Row
Tirumala
Srivari prasadam

More Telugu News