Budda Venkanna: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని చంపేశారనే అనుమానం కలుగుతోంది: బుద్దా వెంకన్న

Budda Venkanna comments on Dharma Reddy

  • ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలన్న బుద్దా వెంకన్న
  • పొన్నవోలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
  • ఆలయాలను అపవిత్రం చేయాలని జగన్ యత్నించారని మండిపాటు

టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలని ఆయన కోరారు. ధర్మారెడ్డిని దాచారా? లేదా వైఎస్ వివేకాను చంపినట్టే ధర్మారెడ్డిని కూడా చంపేశారా? అనే అనుమానం తనకు కలుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మారెడ్డి మీడియా ముందుకు రావాలని అన్నారు. టీటీడీలో ఏం జరిగిందనే విషయాలను ధర్మారెడ్డి బయటకు వచ్చి చెప్పాలని వెంకన్న డిమాండ్ చేశారు. 

తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో రాజ్యంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు కూడా ఇలాగే కారుకూతలు కూశాడని అన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్ పాలేరులా పని చేశారని విమర్శించారు. నిబంధనలు పట్టించుకోని పొన్నవోలు న్యాయ పట్టా రద్దు చేయాలని... హైకోర్టు సుమోటోగా తీసుకుని పొన్నవోలుపై విచారణ జరపాలని కోరారు. ఇంకోసారి పిచ్చిపిచ్చిగా వాగితే బుద్ధి చెపుతామని హెచ్చరించారు.

భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల కొండపై నిన్న డ్రామా ఆడారని బుద్దా మండిపడ్డారు. తాను హిందువు అని చెప్పుకుంటున్న భూమన... వాళ్ల ఇంట్లో క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేయలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాలను అపవిత్రం చేయడానికి జగన్ ప్రయత్నించారని అన్నారు. ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారులకు ఉండాల్సిన లక్షణాలు వీరికి లేవని దుయ్యబట్టారు.

Budda Venkanna
Telugudesam
Dharma Reddy
Jagan
Ponnavolu
Bhumana Karunakar Reddy
YSRCP
  • Loading...

More Telugu News